Home / offers / Bsnl Mega Offer Unlimited Internet 249rs

Bsnl Mega Offer Unlimited Internet 249rs

Bsnl Mega Offer Unlimited Internet 249Rs One Month

Bsnl Mega Offer Unlimited Internet 249Rsదేశంలోనే అతి పెద్ద మొబైల్ నెట్ వర్క్ బీఎస్‌ఎన్‌ఎల్ సంచలన ఆఫర్‌ను ప్రకటించింది. నెలకు 249 రూపాయలు చెల్లిస్తే రోజుకు 10జీబీ డేటా పొందొచ్చని అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ ఉచితంగా వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చని తెలిపింది. ప్రతీ ఆదివారం ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చని కూడా బీఎస్‌ఎన్‌ఎల్ ట్విట్టర్‌లో పేర్కొంది. బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించిన తాజా ఆఫర్ ప్రకారం 1.2 జీబీ కేవలం 1రూపాయికే లభిస్తుంది. జూన్ 30 వరకూ ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ఇంటర్నెట్ స్పీడ్ మినిమమ్ 2ఎంబీపీఎస్. అన్‌లిమిటెడ్ వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ పేరుతో బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. బీఎస్‌ఎన్‌ఎల్ తాజా ఆఫర్‌తో వినియోగదారులు ఉబ్బితబ్బిబవుతున్నారు. పైగా ఈ మంత్లీ ప్యాక్ ధర… దాని ప్రయోజనాలు జియో ప్రకటించిన 303 రూపాయల ప్లాన్ కంటే మెరుగ్గా ఉన్నాయని చెబుతున్నారు. ఏదేమైనా టెలికాం కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో వినియోగదారులు పండగ చేసుకుంటున్నారు. జియో ప్రైమ్ గడువును పొడిగించడంతో బీఎస్‌ఎన్‌ఎల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. From Abn Andhra Jyothi Paper




About admin