Home / బంపరాఫర్ డిస్కౌంట్ల హోరు / బంపరాఫర్ డిస్కౌంట్ల హోరు

బంపరాఫర్ డిస్కౌంట్ల హోరు

బంపరాఫర్ డిస్కౌంట్ల హోరు From Abn Andhra Jyothi

  • బిఎస్‌ 3 వాహనాలపై 40 శాతం వరకు డిస్కౌంట్లు
  • జాబితాలో హీరో, హోండా, సుజుకీ, టీవీఎస్‌, బజాజ్‌
  • ఉచితంగా హెల్మెట్‌, ఇన్సూరెన్స్‌ కూడా

బిఎస్‌ 3 వాహనాలపై సుప్రీంకోర్టు వేటుతో టూవీలర్‌ కంపెనీలు భారీ డిస్కౌంట్లకు తెరతీశాయి. వివిధ రకాల బ్రాండ్లపై దాదాపు 40 శాతం భారీ డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తూ రెండు రోజుల మెగామేళాతో మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. హీరో మోటోకార్ప్‌, హోండా మోటార్‌సైకిల్‌, బజాజ్‌ ఆటో, సుజుకీ మోటార్‌సైకిల్‌, టీవీఎస్‌ వంటి దేశీయ పాపులర్‌ బ్రాండ్లతో పాటు డుకాటీ, హార్లే డెవిడ్సన్‌, ట్రయంఫ్‌ వంటి లగ్జరీ బైక్‌ బ్రాండ్స్‌ కూడా ‘‘ మెగా సేల్‌ ’లో ఉన్నాయి. ఇలాంటి డిస్కౌంట్లు ఇంతకుముందెన్నడూ కనీవినీ ఎరుగలేదని డీలర్లు అంటున్నారు. మార్చి 31 వరకు లేదా స్టాక్‌ ఉన్నంత వరకు ఆఫర్లు వర్తిస్తాయని కంపెనీలు చెబుతున్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లోనూ ఆటోమొబైల్‌ షోరూమ్‌లు కస్టమర్లతో కిటకిట లాడుతున్నాయి. కొన్ని షోరూమ్‌ల్లో స్టాక్‌ తొలిరోజే ఖలాస్‌ అయినట్టు చెబుతున్నారు…

హోండా మోటార్‌సైకిల్‌ రూ.22,000 డిస్కౌంట్‌
బిఎస్‌3 స్కూటర్లు, మోటార్‌సైకిళ్లపై తొలుత 10,000 రూపాయల ఫ్లాట్‌ డిస్కౌంట్‌ను ప్రకటించిన హోండా.. తర్వాత అన్ని మోడళ్లపై గరిష్ఠ డిస్కౌంట్‌ను 22,000 రూపాయలకు పెంచింది. యాక్టివా 3జి, డ్రీమ్‌ యుగా, సిబి షైన్‌, సిడి 110 డిఎక్స్‌వంటి బిఎస్‌ 3 మోడళ్లపై గరిష్ఠంగా 22,000 రూపాయల క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ను ఇస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. డ్రీమ్‌ నియో (రూ.18,500), సిబిఆర్‌ 150ఆర్‌ (రూ.22,000), యునికార్న్‌, డ్రీమ్‌ యుగా (రూ.18,500 రూపాయలు), డియో (రూ,13,500). నవీ (రూ.18,500), ఏవియేటర్‌ (రూ.13,500), లివో (రూ.13,500) వంటి మోడళ్లపై కంపెనీ డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేసింది.

సుజుకీ మోటార్‌ సైకిల్‌ క్యాష్‌బ్యాక్‌
ఈ కంపెనీ వివిధ మోడల్స్‌పై 20,000 రూపాయల వరకు క్యాష్‌ బ్యాక్‌ ఇస్తోంది. తన లెట్స్‌ స్కూటర్‌, జిక్సర్‌ మోటార్‌సైకిల్‌పై ఆఫర్లు ప్రకటించింది. లెట్స్‌పై 4,000 రూపాయల డిస్కౌంట్‌తోపాటు ఉచితంగా హెల్మెట్‌ ఆఫర్‌ చేస్తోంది. జిక్సర్‌పై 5,000 రూపాయలతోపాటు ఎక్స్ఛేంజ్‌పై 2,000 రూపాయల వరకు ఇస్తోంది.

హీరో మోటో కార్ప్‌ రూ.12,500, బీమా
మార్కెట్‌ లీడర్‌ హీరో మోటోకార్ప్‌ బిఎస్‌ 3 బైక్‌లపై గరిష్ఠంగా 12,500 రూపాయల sbtet worldడిస్కౌంట్‌ను ప్రకటించింది. ప్రీమియం బైక్స్‌పై 7,500 రూపాయలు, ఎంట్రీలెవల్‌ మాస్‌ మార్కెట్‌ బైక్‌లపై 5,000 రూపాయల డిస్కౌంట్‌ను ఇస్తోంది. డ్యూయట్‌, మాస్టో ఎడ్జ్‌, సూపర్‌ స్ల్పెండర్‌, గ్లామర్‌పై కంపెనీ 12,500 రూపాయల డిస్కౌంట్‌ ప్రకటించింది. ప్లెజర్‌పై డిస్కౌంట్‌ 14,000 రూపాయల వరకు ఉంది. ఉచిత ఇన్సూరెన్స్‌ను కంపెనీ ఇస్తోంది.

బజాజ్‌ ఆటో..

sbtet world

వివిధ రకాల మోడళ్లపై బజాజ్‌ ఆటో డిస్కౌంట్లతోపాటు ఉచిత బీమాను కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ప్లాటినా నుంచి పల్సర్‌ ఆర్‌ఎస్‌ 200 మోడళ్ల వరకు రూ.3,000 నుంచి 12,000 రూపాయల వరకు డిస్కౌంట్‌ను ఇస్తోంది.

టీవీఎస్‌
ఈ కంపెనీ అపాచీ ఆర్‌టిఆర్‌ 200 (రూ.10,000), ఆర్‌టిఆర్‌ 160 (5,000), విక్టర్‌ 110 (రూ.5,000), జూపిటర్‌ (రూ.5,000) తదితర మోడళ్లపై డిస్కౌంట్లు ఇస్తోంది. గరిష్ఠంగా 20,150 రూపాయల వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నట్టు కంపెనీ తెలిసింది.

డుకాటి

ఈ కంపెనీ మాన్‌స్టర్‌ 821పై రూ.2.70 లక్షలు, స్ర్కాంబర్‌పై 2.50 లక్షలు, డియావెల్‌ 2 లక్షల రూపాయల డిస్కౌంట్లు ఇస్తోంది.
 

ట్రయంఫ్‌
క్రూజర్‌ మోటార్‌సైకిల్స్‌పై 3 లక్షల రూపాయలు, డేటోనా స్పోర్ట్‌ బైక్‌పై లక్ష రూపాయలు, అడ్వెంచర్‌ బైక్స్‌లపై 60,000-80,000 రూపాయల డిస్కౌం ట్‌ను ఈ కంపెనీ ఇస్తోంది.

విదేశాలకూ ఎగుమతి..
ఈ ఆఫర్లతో అమ్ముడుపోగా మిగిలిన వాహనాలను విదేశాలకు ఎగుమతి చేయాలని కంపెనీలు భావిస్తున్నాయి. తాము 70 దేశాలకు వాహనాలను ఎగుమతి చేస్తున్నామని, బిఎస్‌ 3 వాహనాలు భారత మార్కెట్లో అమ్ముడుకాకపోతే మిగతా దేశాలకు పంపిస్తామని బజాజ్‌ ఆటో ప్రెసిడెంట్‌ (బిజినెస్‌ డెవల్‌పమెంట్‌, అష్యూరెన్స్‌) ఎస్‌ రవి కుమార్‌ తెలిపారు.

ఎన్నడూ లేని డిస్కౌంట్లు
ద్విచక్ర వాహనాలకు సంబంధించి ఇంతకు ముందెన్నడూ ఇలాంటి డిస్కౌంట్లను విని ఎరుగమని ఆటోమొబైల్‌ డీలర్స్‌ సమాఖ్య (ఫాడా) మాజీ అధ్యక్షుడు నికుంజ్‌ సంఘీ తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ వాహనాలు విక్రయించాలన్న దానిపైనే తాము దృష్టిసారించామని చెప్పారు. అమ్ముడుపోగా మిగిలిన వాహనాలను ఏం చేయాలన్న దానిపై కంపెనీలతో చర్చించాల్సి ఉందని తెలిపారు.

ఒక్కసారే ప్రభావం..
బిఎస్‌ 3 వాహనాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించడం వల్ల ఒక్కసారి మాత్రమే ఆటోమొబైల్‌ పరిశ్రమపై ప్రభావం ఉంటుందని మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) పేర్కొంది. సుప్రీం నిషేధ ఆదేశం ఊహించనిదని తెలిపింది. తమ కంపెనీపై ప్రభావం ఉండకుండా ప్రత్యామ్నాయాలపై ఆలోచన చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది.

About admin

error: